BRS-Congress: భారాసకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

భారత రాష్ట్ర సమితి (భారాస)కు మరో షాక్‌ తగిలింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 

Updated : 24 Jun 2024 05:38 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత రాష్ట్ర సమితి (భారాస)కు మరో షాక్‌ తగిలింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు. దీంతో రేవంత్‌రెడ్డి సంజయ్‌కు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజుల కిందే తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సంజయ్‌తో కలిపి ఇప్పటివరకు ఐదుగురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని