BRS MLC: సీఎంను కలసిన భారాస ఎమ్మెల్సీ చల్లా

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 09 Jul 2024 04:28 IST

సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న చల్లా వెంకట్రామిరెడ్డి. పక్కన చల్లా అగస్త్యరెడ్డి, ఎంపీ మల్లు రవి

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. రాయచూరు- ఐజ- శాంతినగర్‌- అలంపూర్‌- నందికొట్కూరు- శ్రీశైలం(అంతర్రాష్ట్ర  హైవే) నాలుగు వరసల రోడ్డు వేస్తే బాగుంటుందని చల్లా కోరారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి, మల్లమ్మ కుంట, వల్లూరు రిజర్వాయర్లు, అలంపూర్‌ వాసులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఏపీలోని కర్నూలులో వైద్యసేవలు వర్తింపజేయాలని ఆయన విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. చల్లా త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వెంట భారాసకు చెందిన అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు సైతం హస్తం గూటికి చేరతారని నేతలు పేర్కొంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని