Kavitha: కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: భారాస కార్యకర్తల డిమాండ్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా నగరంలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా నగరంలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారాస శ్రేణులు, నేతలు పలు చోట్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వెంటనే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని.. కవితకు క్షమాపణ చెప్పాలని భారాస కార్యకర్తలు డిమాండ్ చేశారు. దిల్లీలో కవిత విచారణ, నగరంలో భారాస ఆందోళనల దృష్ట్యా నగరంలోని బషీర్‌బాగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి తాళాలు వేసి.. పోలీసులు భారీగా మోహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rakul Preet Singh: అదొక కీలక నిర్ణయం.. ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నా: రకుల్ ప్రీత్ సింగ్
-
Bomb blast: బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 34 మంది మృతి
-
Jet Airways: జెట్ ఎయిర్వేస్లో కీలక పరిణామం.. వచ్చే ఏడాది నుంచి రెక్కలు
-
Madhya Pradesh rape: వైరల్ వీడియో చూసి, నా బిడ్డను గుర్తించా: బాలిక తండ్రి ఆవేదన
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు