BRS: కేసీఆర్ సంతకం.. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం
దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (భారాస) ఏర్పాటైంది.
హైదరాబాద్: దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (భారాస)(BRS) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) (TRS) పేరు భారత్ రాష్ట్ర సమితి (భారాస)గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారాస ఆవిర్భావానికి సంబంధించి ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు.
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన భారాస ఆవిర్భావ వేడుకల్లో తొలుత కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ సుముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్ (KCR)సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చినట్లయింది. కేసీఆర్ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు.
కుమారస్వామి, ప్రకాశ్‌రాజ్ శుభాకాంక్షలు
భారాస ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్‌కు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారాస ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాణసంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత
-
World News
5 నెలలకే పుట్టేశారు.. ముగ్గురు కవలల గిన్నిస్ రికార్డు
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
India News
బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల యువతి