BRS: 20 మంది భారాస నాయకులపై బహిష్కరణ వేటు
వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది భారాస (BRS) నాయకులపై పార్టీ అధిష్ఠానం బహిష్కరణ వేటు వేసింది. మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి పార్టీ పై తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంది.
వైరా: ఖమ్మం జిల్లా భారాస మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన పొంగులేటి వర్గంపై భారాస బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది ముఖ్య నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్‌తో పాటు మరో 18 మందిని భారాస నుంచి సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, భారాస అధిష్ఠానికి మధ్య పొసగడం లేదు. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్న పొంగులేటి.. పార్టీ నుంచి దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు, భారాస ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!