BS Koshiyari: కరోనాతో ఆసుపత్రిలో ‘మహా’ గవర్నర్.. అయినా కలిసే వెసులుబాటు..!

మహారాష్ట్రలో మహావికాస్ అఘాఢీ పతనం అంచునకు చేరుకుంది. ఈ సమయంలో కీలక పాత్ర పోషించాల్సి ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ కరోనా బారినపడ్డారు.

Updated : 22 Jun 2022 13:14 IST

ముంబయి: మహారాష్ట్రలో మహావికాస్ అఘాఢీ పతనం అంచునకు చేరుకుంది. ఈ సమయంలో కీలక పాత్ర పోషించాల్సి ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో బుధవారం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆయన్ను కలవాలనుకుంటున్నవారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చంటూ రాజభవన్‌ నుంచి ప్రకటన వెలువడింది.

‘గవర్నర్‌లో కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండటంతో.. ఆయన బాధ్యతలు ఇతరులకు అప్పగించే విషయమై ఎలాంటి చర్చలు లేవు. గవర్నర్‌ను ఎవరైనా కలవాలనుకుంటే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ వెసులుబాటు ఉంది’ అని పేర్కొంది.

ప్రస్తుతం మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాఢీ కూటమి కూలిపోయే దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం తప్పేట్టు లేదు. ఈ రోజు సాయంత్రం జరిగే కేబినేట్ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినా, ఎంవీఏ మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉన్నా.. అవన్నీ గవర్నర్‌ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సందిగ్ధతను తొలగించే నిమిత్తం రాజ్‌భవన్ స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని