BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?

కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల ప్రచారవేడి మొదలైంది. ఎవరిపై ఎవరు పోటీ పడతారు..? ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

Published : 30 Mar 2023 18:21 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అక్కడ రాజకీయ వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేసే పనిలో పడ్డాయి. అలాగే అక్కడి నియోజవర్గాల్లో బరిలో నిలిచే నేతలు కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో భాజపాను ప్రచారసారథిగా వ్యవహరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(BS Yediyurappa) తనయుడు.. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah)పై పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. 

కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ స్థానానికి ప్రస్తుతం సిద్ధూ తనయుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు సిద్ధూకు పోటీగా యడ్డీ కుమారుడు బీవై విజయేంద్ర దిగనున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను అక్కడి నుంచి నిలబెట్టాలా..? వద్దా..? అనేదానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని యడ్డీ వెల్లడించారు. ఎన్నికల తేదీని ప్రకటించిన మరుసటి రోజున జరిగిన అత్యవసర మీడియా సమావేశంలో ఈ విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించారు.   

దక్షిణాది రాష్ట్రం కర్ణాటక (Karnataka)అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) బుధవారం షెడ్యూల్‌ విడులైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.  ఈ ఎన్నికలకు ఏప్రిల్‌ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్‌ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని