కేసులు మాకు కొత్త కాదు: బీటెక్‌ రవి

మూడు రోజుల క్రితం వరకు సొంత ఊరిలో ఉన్నప్పుడు పట్టించుకోని పోలీసులు.. పనిమీద పొరుగు రాష్ట్రంలో ఉంటే  హడావుడి చేయడమేంటని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ..

Published : 03 Jan 2021 19:02 IST

చెన్నై: మూడు రోజుల క్రితం వరకు సొంత ఊరిలో ఉన్నప్పుడు పట్టించుకోని పోలీసులు.. పనిమీద పొరుగు రాష్ట్రంలో ఉంటే  హడావుడి చేయడమేంటని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ప్రశ్నించారు. చెన్నైలో కడప స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన అనంతరం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్న తెదేపా నేతలను అరెస్ట్‌ చేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదన్నారు. బెంగళూరు నుంచి చెన్నై వస్తే అంతర్జాతీయ నేరస్థుడిని పట్టుకున్నట్లు విమానాశ్రయం రన్‌వేపై పోలీసులు అరెస్ట్‌ చేశారని రవి ఆరోపించారు. కేసులు తమకేమీ కొత్త కాదని.. ప్రజల కోసం జైలుకెళ్లేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనన్నారు.

కక్ష సాధింపే: చంద్రబాబు

బీటెక్‌ రవిపై కేసు నమోదు చేయడం కక్ష సాధింపులో భాగమేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చలో పులివెందుల నిర్వహించినందునే ఆయన్ను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. అధికార బలంతో తెదేపా నేతలపై అక్రమకేసుల బనాయిస్తున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

ఇవీ చదవండి..

చెన్నైలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌

రామతీర్థం ఘటనలో 12 మంది అరెస్ట్‌: ఎస్పీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని