Andhra News: భువనేశ్వరి, బాలకృష్ణలను విమర్శించే స్థాయి కొడాలికి ఎక్కడిది...?

నందమూరి హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన కొడాలి నానికి ఎన్టీఆర్‌ వారసులైన భువనేశ్వరి, బాలకృష్ణలను విమర్శించే స్థాయి ఎక్కడ నుంచి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

Updated : 15 Oct 2022 09:10 IST

తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న

విజయవాడ(విద్యాధరపురం), న్యూస్‌టుడే: నందమూరి హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన కొడాలి నానికి ఎన్టీఆర్‌ వారసులైన భువనేశ్వరి, బాలకృష్ణలను విమర్శించే స్థాయి ఎక్కడ నుంచి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. విజయవాడ మల్లికార్జునపేటలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషిస్తే, తాము కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని అలాగే అంటే కుల విద్వేషాలు రెచ్చగొట్టవచ్చునని నాని భావిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే తాము ఆయన మైండ్‌ గేమ్‌లో పడమని, అటువంటి రాజకీయాలు చేయమని చెప్పారు. చంద్రబాబుపై తిట్ల దండకం మానుకోకపోతే ప్రజలు కొడాలికి బుద్ధి చెబుతారన్నారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు కొడాలి నాని సహా మిగతావాళ్లు ఏమి చేశారో త్వరలో బయటపెడతానన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు ఎస్‌.ఏడకొండలు, పేరబత్తుల రమణ, గణపా రాము పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని