Butchaiah Chaudhary: ఏపీ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేశారు.

Published : 20 Jun 2024 18:08 IST

అమరావతి: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి , అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, ఎస్.సవిత, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు, ఏలూరి సాంబశివరావు, ఎం.ఎస్ రాజు, సుంకర విజయ్ కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీనియర్‌ ఎమ్మెల్యే కావడంతో ఆయనే ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని