Byreddy Rajasekhar reddy: స్కామ్‌లు చేయడం జగన్‌కు అలవాటేమో.. చంద్రబాబుకు కాదు: బైరెడ్డి

రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజమహేంద్రవరంలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు.

Published : 28 Sep 2023 19:31 IST

రాజమహేంద్రవరం: రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజమహేంద్రవరంలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆర్థిక నేరాలు చేసి బెయిల్‌పై ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. కుంభకోణాలు చేయడం జగన్‌కు అలవాటేమో కానీ చంద్రబాబుకు కాదన్నారు. చంద్రబాబు అనుభవం అంత వయస్సు కూడా సీఎం జగన్‌కు లేదన్నారు. ఆయన్ను తప్పుడు కేసుల్లో ఇరికించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

ప్రజల మద్దతు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా చంద్రబాబును జైల్లో పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్టు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేదరన్నారు. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు