Telangana Assembly: తెలంగాణ శాసనసభలో కాగ్‌ నివేదిక ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది.

Updated : 15 Mar 2022 14:29 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2019-20 ఏడాదికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కాగ్‌ పేర్కొంది. ఐదేళ్లలో తొలిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని.. ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్‌ రుణాల ద్వారా వచ్చిందని తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే అప్పులు ఉన్నాయని  పేర్కొంది. 2020 మార్చి 31తో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదిక విడుదల చేసింది.

‘బడ్జెట్‌ వెలుపల రుణ లక్ష్యాల పరిమితిని ప్రభుత్వం అధిగమించింది. 2019-20లో తీసుకున్న రుణాల్లో ఎక్కువగా గత అప్పుల కోసమే వాడారు. 75 శాతానికి పైగా గత అప్పుల చెల్లింపులకే వినియోగించారు. దీంతో ఆస్తుల కల్పనపై ప్రభావం పడింది. 2019-20లో విద్య, వైద్యరంగాలపై తక్కువ ఖర్చు కొనసాగింది. ఆ ఏడాదిలో ఆస్తుల కల్పనపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదు’’ అని కాగ్‌ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని