Rahul Gandhi: గడ్డం పెంచుకుంటే ప్రధాని అయిపోరు: సామ్రాట్ చౌదరి
రాహుల్ గాంధీ (Rahul Gandhi) గడ్డంపై తాజాగా బిహార్ భాజపా అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గడ్డం పెంచుకుంటే దేశానికి ప్రధానమంత్రి కాలేరని చెప్పారు.
పట్నా: ‘భారత్ జోడో’ (Bharata Jodo) యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుబురు గడ్డంతో కనిపించారు. యాత్ర పూర్తవగానే గడ్డం కాస్త తొలగించారు. తాజాగా రాహుల్ గడ్డంపై బిహార్ భాజపా (Bjp)అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎవరైనా గడ్డం పెంచుకున్నంత మాత్రాన దేశానికి ప్రధాని మంత్రి కాలేరని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అరారియా జిల్లాలో నిర్వహించిన పార్టీ ర్యాలీలో సామ్రాట్ పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ గడ్డం పెంచుకొని ప్రధాన మంత్రి అవ్వాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై కూడా మండిపడ్డారు. ‘‘దేశమంతా తిరుగుతూ.. నితీశ్ తనే దేశ ప్రధానినని చెప్పుకుంటారు. విపక్షాలకు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి కూడా లేదు’’అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా