Kanpur Mayor: ఓటేసి.. ఫొటో తీసి.. షేర్‌ చేసిన మేయర్‌

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్‌ కొనసాగుతున్న యూపీలోని కాన్పూర్‌లో ఆ నగర మేయర్‌ ప్రమీలా పాండే చేసిన ఓ పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది....

Published : 20 Feb 2022 11:11 IST

కాన్పూర్‌: అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోన్న యూపీలోని కాన్పూర్‌లో ఆ నగర మేయర్‌ ప్రమీలా పాండే చేసిన ఓ పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పోలింగ్‌ బూత్‌లో ఓటేసిన తర్వాత ఫొటోలు, వీడియోలు తీయడం చర్చనీయాంశమైంది. అంతటితో ఆగకుండా వాటిని కొన్ని వాట్సాప్ గ్రూప్‌లలో పోస్ట్‌ చేసినట్లు సమాచారం.

కాన్పూర్‌లోని హడ్సన్‌ స్కూల్‌లో ఆమె ఓటువేశారు. ఈవీఎంపై మీట నొక్కుతున్న దృశ్యాన్ని ఆమె ఫొటో, వీడియో తీశారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఆ చిత్రాలు వైరల్‌గా మారాయి. ఈ విషయం ఆ జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద చర్యలకు ఉపక్రమించారు. సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు మూడో దశలో భాగంగా మొత్తం 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న కర్హల్‌ సీటుకు నేడే పోలింగ్‌ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు