
MLC Elections: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్‌పై కేసు నమోదు
కరీంనగర్: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్‌పై కేసు నమోదు అయింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కరీంనగర్ గ్రామీణ ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. రవీందర్ సింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్లో బరిలోకి దిగారు. మీడియా సమావేశంలో ఓటర్లు రూ.10 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నా.. ఓటు మాత్రం తనకే వేయాలని రవీందర్ సింగ్ అన్నట్లు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవో ఫిర్యాదు మేరకు రవీందర్‌సింగ్‌పై కేసు నమోదు అయింది.
తెరాసలో ఉండి కరీంనగర్ మేయర్‌గా ఎన్నికైన రవీందర్ సింగ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందనే ఆశతో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరాస తరఫున ఎల్. రమణ, టి.భాను ప్రసాద్‌రావును పార్టీ బరిలోకి దించింది. దీంతో తనకు టికెట్ రాకపోవడంతో రవీందర్‌సింగ్ పార్టీకి రాజీనామా చేసి స్వంతత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.