Kodali Nani: కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు

ఏపీ బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైకాపా నేత కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు.

Updated : 06 Jul 2024 15:39 IST

గుడివాడ: ఏపీ బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ రెండో పట్టణ పీఎస్‌లో గుడివాడ ఆటోనగర్‌ వాసి దుగ్గిరాల ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తమ గోదాములో ఉన్న లిక్కర్‌ కేసులను పగులకొట్టి తగులబెట్టారని అందులో పేర్కొన్నారు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవీలత దూషించారని ఆరోపించారు. కొద్దిరోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించిందని ప్రభాకర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని