Ragurama: ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్, సీర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, రఘురామ పీఏ శాస్త్రిలను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చారు.
ఏం జరిగిందంటే?
హైదరాబాద్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం నియోజకవర్గం ఎంపీ రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ఇది గమనించిన ఎంపీ భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు అతడిని పట్టుకొన్నారు. వారు ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఐడీ, ఆధార్‌కార్డులు చూపేందుకు నిరాకరించాడు. అనంతరం గచ్చిబౌలి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.
ఎంపీని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ..
శనివారం ఉదయమే 10-12 మంది వ్యక్తులు రెండు కార్లలో హైదరాబాద్ చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఇన్నోవాలో గచ్చిబౌలిలోని ఎంపీ రఘురామ ఇంటి వద్ద కాపు గాసినట్టు సమాచారం. ఆయన వాహనాన్ని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ వచ్చారు. ఏపీ పోలీసులు తనను వెంబడిస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాత్రి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం బయల్దేరిన ఎంపీ రఘురామ ప్రధాని సభకు వెళ్లకుండానే బేగంపేట రైల్వేస్టేషన్లో దిగిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎంపీ రఘురామ నివాసంలోకి ఒకరు ప్రవేశించి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించే ప్రయత్నించారు. ఇది గుర్తించిన ఎంపీ అనుచరులు అప్రమత్తమయ్యారు. దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి సుభాని అని, అతడి ఫోన్‌కు ఆంజనేయులు అనే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తిని గమనించామని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఎంపీ రఘురామ పీఏ శాస్త్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వైపు విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని ఇంట్లోకి తీసుకెళ్లారని, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్కే ఫరూక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వచ్చిన ఫిర్యాదులు తీసుకొని విచారణ చేపట్టామని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ వెల్లడించారు. ఈమేరకు ఎంపీ రఘురామతో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది.
సీఎం కేసీఆర్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ
హైదరాబాద్‌లో తన ఇంటి వద్ద జరుగుతున్న రెక్కీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘‘నిన్న నా ఇంటి వద్ద ఆరుగురు రెక్కీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నా భద్రత దృష్ట్యా సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించింది. నిన్న రెక్కీ నిర్వహించిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు దొరికారు, మిగిలిన వారు కారులో పారిపోయారు. పట్టుబడ్డ వ్యక్తి ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాన్ అలీ భాషా అని తెలిపాడు. ఐడీ కార్డు చూపాలని కోరితే నిరాకరించాడు. అతని ఉన్నతాధికారికి ఫోన్ చేయమన్నా చేయలేదు. ఈ విషయంపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెక్కీ నిర్వహించడానికి గల కారణాలపై విచారణ చేయమని కోరాం. రెక్కీలకు సంబంధించి గతంలో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశాం. ఫిబ్రవరి 26న ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు పోలీసులు విచారణ చేయలేదు. రెక్కీ తీవ్రతను తగ్గించేందుకు స్టీఫెన్రవీంద్ర ఏపీ పోలీసులకు సహకరిస్తున్నారు. స్టీఫెన్ రవీంద్రను ముఖ్యమంత్రి జగన్ ఏపీ కేడర్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏపీ పోలీసులకు ఆయన సహకరిస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా నాపై, నాకు భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌ను కొట్టి తన ఫోన్, ఐడీ కార్డులు దొంగిలించామని కేసు నమోదు చేశారు. నన్ను, నా కుటుంబాన్ని హత్య చేసేందుకు వచ్చారని నాకు అనిపిస్తోంది. దయచేసి వెంటనే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
-
India News
NITI Aayog: మోదీ అధ్యక్షతన ‘నీతి ఆయోగ్’ సమావేశం ప్రారంభం.. కేసీఆర్, నీతీశ్ గైర్హాజరు..
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
-
General News
Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలు పరిష్కరించదగ్గవే: గవర్నర్ తమిళిసై
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- సూర్య అనే నేను...
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)