TS News: వారి ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరు: రేవంత్‌

సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ అఖిలపక్ష సమావేశంలో రేవంత్...

Updated : 12 Oct 2021 11:14 IST

హైదరాబాద్‌: సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఓబీసీ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ‘‘మోదీ వన్ నేషన్ వన్ సెన్సెస్‌ను ఎందుకు తీసురావడం లేదు? మోదీ ప్రభుత్వం కులగణన చేయకపోవడంలో మతలబు ఏంటి? కుల గణన చేస్తేనే రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరు. బీసీలు కులగణన కోరడంలో న్యాయముంది. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పోరాడుతుంది. అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలా న్యాయం చేయాలో ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. సమగ్ర కుటంబ సర్వేను కేసీఆర్‌ ఎందుకు బయటపెట్టడం లేదు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఇప్పటికైనా సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయటపెట్టాలి. బీసీ సంఘాలు చేసే అన్ని ఉద్యమాలకు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుంది’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని