వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్లే గుంటూరుకి ఈ దుస్థితి: పెమ్మసాని

కేంద్ర, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధుల్ని వైకాపా ప్రభుత్వం దారి మళ్లించి, దుర్వినియోగం చేయడంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. 

Updated : 23 Jun 2024 17:03 IST

గుంటూరు: కేంద్ర, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధుల్ని వైకాపా ప్రభుత్వం దారి మళ్లించి, దుర్వినియోగం చేయడంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో స్థానిక ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మద్‌, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో తాగునీరు సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌, రహదారులు, ఇతర పనులకు కేటాయించిన రూ.వందల కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించి ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు. నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. అర్ధాంతరంగా నిలిచిన పనుల్ని వెంటనే ప్రారంభించి, నగరవాసులకు కనీస సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని