Piyush Goyal: తెలంగాణ నుంచి రారైస్‌ కొంటాం.. ప్రభుత్వమే సహకరించట్లేదు: పీయూష్‌ గోయల్‌

దేశమంతా ధాన్యం సేకరిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రశ్నించారు. ఇవాళ దిల్లీలో కేంద్ర మంత్రి గోయల్‌ను తెలంగాణ భాజపా

Updated : 21 Mar 2022 16:59 IST

దిల్లీ: దేశమంతా ధాన్యం సేకరిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రశ్నించారు. ఇవాళ దిల్లీలో కేంద్ర మంత్రి గోయల్‌ను తెలంగాణ భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బాపూరావు, బండి సంజయ్‌ కలిశారు. కేంద్రంపై తెరాస ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనట్లేదని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై గోయల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా గతంలోనే ఈ విషయంపై సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. యాసంగి సీజన్‌లోనూ తెలంగాణ నుంచి రారైస్‌ను కొంటామని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదన్నారు. గతంలో సేకరించి ఇస్తానన్న బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. ఇకపై బాయిల్డ్‌ రైస్‌ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసిందన్నారు. పసుపు రైతులకు పరిహారంపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కేంద్ర మంత్రితో చర్చించారు. పరిహారంపై ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని