Tirupati: పాల సొసైటీ ఎన్నికల్లోనూ రక్త చరిత్ర రాస్తావా సీఎం..: తెదేపా

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పాల సహకార సంఘం ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం నాయకులు నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు వారిపై దాడికి దిగారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న నాయకులను ఉదయం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

Updated : 01 May 2022 05:22 IST

శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పాల సహకార సంఘం ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం నాయకులు నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు వారిపై దాడికి దిగారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న నాయకులను ఉదయం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీన్ని ఖండిస్తూ తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చలపతి నాయుడు, తిరుపతి తెదేపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్ శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో మీడియా సమావేశం అనంతరం నామినేషన్ వేసేందుకు బయల్దేరే సమయంలో వైకాపా కార్యకర్తలు మూకుమ్మడిగా ఆర్టీసీ కూడలి వద్దకు చేరుకుని చలపతినాయుడు కారును ధ్వంసం చేశారు. రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసి, కారులోని నామినేషన్ పత్రాలను లాక్కొని వెళ్లారు. ఆర్టీసీ కూడలి వద్దకు చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయం చేయాలని అంబేడ్కర్ కూడలిలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెదేపా నేతలుమాట్లాడుతూ దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని, దీనికి ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  నామినేషన్‌ వేయనీయకుండా అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతోందా అని ప్రశ్నించారు. పాల సొసైటీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు. ఇలాంటి ఎన్నికల్లోనూ రక్తచరిత్ర రాస్తావా ముఖ్యమంత్రి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని