TDP Formation Day: ప్రజల జీవితాల్లో తెదేపా వెలుగులు నింపింది: చంద్రబాబు
ఆత్మగౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో తెదేపా వెలుగులు నింపిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.
అమరావతి: ఆత్మగౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో తెదేపా వెలుగులు నింపిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుజాతికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సకల రంగాల అభివృద్ధిపై తెదేపా సంతకం చెరగనిది: లోకేశ్
తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా, రాజకీయ చైతన్యానికి సంకేతంగా తెదేపా ఆవిర్భవించి 41 ఏళ్లు పూర్తయిందని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయాల మేరకు అణగారిన వర్గాలకు పసుపు జెండా అండగా నిలిచిందని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. బడుగు బలహీనవర్గాలకు తెదేపా భరోసాగా నిలిచిందని.. మహిళల స్వావలంబనకు చేయూత అందించిందని లోకేశ్ పేర్కొన్నారు. సకల రంగాల అభివృద్ధిపైనా తెదేపా సంతకం చెరగనిదని చెప్పారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని లక్షలాది కార్యకర్తల సైన్యం తెదేపా బలమని కొనియాడారు. ‘‘నేను తెలుగువాడినని సంతోషిస్తాను.. తెలుగుదేశం వాడినని గర్విస్తాను’’ అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
-
Movies News
Randeep Hooda: వీర్ సావర్కర్ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
-
Movies News
ప్రేక్షకులకు గుడ్‌న్యూస్: థియేటర్లో విడుదలైన రోజే కొత్త సినిమా ఇంట్లో చూసేయొచ్చు!
-
Sports News
CSK: పారితోషికం తక్కువ.. పెర్ఫామెన్స్ ఎక్కువ.. ఆ చెన్నై ప్లేయర్స్ ఎవరంటే?
-
World News
Imran Khan: నాలుగో భార్యనవుతా.. ఇమ్రాన్‌ఖాన్‌కు టిక్‌టాకర్ ప్రపోజల్