Chandrababu: ఎన్నికల ఫలితాలతో పొత్తులకు సంబంధం లేదు: చంద్రబాబు

ఎన్నికల కోసం తాను కుప్పం రాకున్నా ఏడుసార్లు ప్రజలు గెలిపించారని.. వాళ్లతో తనది భావోద్వేగపూరిత అనుబంధమని తెదేపా

Updated : 07 Jan 2022 14:26 IST

కుప్పం: ఎన్నికల కోసం తాను కుప్పం రాకున్నా ఏడుసార్లు ప్రజలు గెలిపించారని.. వాళ్లతో తనది భావోద్వేగపూరిత అనుబంధమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 

సీఎం జగన్‌ విధ్వంసకారి అని.. కక్ష, కార్పణ్యాలు, బెదిరింపులతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పేదల ద్రోహి అని మండిపడ్డారు. మీడియా, న్యాయవ్యవస్థతో పాటు ప్రజల్ని బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. వైకాపా పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా బాధపడే పరిస్థితి నెలకొందన్నారు.

పొత్తుల అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా..ఎన్నికల ఫలితాలతో పొత్తులకు సంబంధం లేదని చెప్పారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచిన, ఓటమి పాలైన సందర్భాలూ ఉన్నాయన్నారు. పొత్తులు లేనప్పుడు కూడా  గెలిచామని.. ఈ విషయాన్ని వైకాపా నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజలు ఓట్లేయాలనుకుంటే అన్నీ జరుగుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని