AP News: వ‌డ్డీతో చెల్లించే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది: చంద్ర‌బాబు

బ‌న‌గాన‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత‌ బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డి చేసిన త‌ప్పేంటి.. ఎందుకు ఆయ‌న‌ను అరెస్టు చేశారు? అని తెదేపా అధినేత చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. జ‌నార్ధ‌న్‌రెడ్డి అరెస్టుపై తెదేపా రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్చువ‌ల్

Published : 27 May 2021 00:21 IST

తెదేపా నేత అరెస్టుపై వ‌ర్చువ‌ల్ వేదిక‌గా నిర‌స‌న‌

అమ‌రావ‌తి: బ‌న‌గాన‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత‌ బీసీ జ‌నార్దన్‌రెడ్డి చేసిన త‌ప్పేంటి.. ఎందుకు ఆయ‌న‌ను అరెస్టు చేశారు? అని తెదేపా అధినేత చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. తెదేపా నేత‌ అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ వ‌ర్చువ‌ల్ విధానంలో నిర‌స‌న చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. జనార్దన్‌రెడ్డి ఎప్పుడూ ప్రజా సేవ కోసం ప‌ని చేశార‌న్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే త‌ప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ముఠా క‌క్ష‌లు, హింస‌ను ప్రేరేపించేలా జ‌నార్దన్‌రెడ్డి ఎప్పుడూ ప‌ని చేయ‌లేద‌ని వివ‌రించారు. తెదేపా ముఠా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. త‌మ హ‌యాంలో అభివృద్ధితో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టిన‌ట్లు వివరించారు.

జ‌గ‌న్‌ను న‌మ్ముకున్న వాళ్లంతా జైలుకెళ్లి వ‌చ్చారు: చంద్ర‌బాబు

''జ‌నార్దన్‌రెడ్డి కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఎలా వ‌ర్తిస్తుంది.?  తెదేపా నేత అనుచ‌రుల‌ను పోలీస్ స్టేష‌న్‌లో పెట్టి కొట్ట‌డం నేరం. తెదేపా నేత‌ల‌ను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. త‌ప్పు చేస్తే పోలీసులు కూడా జైలుకెళ్లే ప‌రిస్థితి వ‌స్తుంది. జ‌గ‌న్‌ను న‌మ్ముకున్న వాళ్లంతా ఇప్ప‌టికే జైలుకెళ్లి వ‌చ్చారు. ప్ర‌భుత్వాలు శాశ్వ‌తం కాద‌ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. వ‌డ్డీతో స‌హా చెల్లించే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది. మూడేళ్ల త‌ర్వాత మీ వెనుక ఎవ‌రోస్తారో నేనూ చూస్తా. 22 ఏళ్లు అధికారంలో ఉన్న మేము ఇలాగే చేశామా? మీరు బాధ‌ప‌డే రోజూ ద‌గ్గ‌ర్లోనే ఉంది''  అని చంద్ర‌బాబు అన్నారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ దాడులు మొద‌ల‌య్యాయ‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపుల‌కే ప్రాధాన్యం ఇస్తోంద‌ని ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వ‌చ్చాక కొత్త రాజకీయాలు వ‌చ్చాయ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఈ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు.. అక్ర‌మ అరెస్టుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ప్పుడు కేసుల‌ను ఉప‌సంహ‌రించుకొని తమ పార్టీ నేత‌ల‌ను విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. క‌ర్నూలు జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లెలో ఈ నెల 23న వైకాపా, తెదేపా వ‌ర్గీయుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించి తెదేపా నేత బీసీ జనార్దన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని