Chandrababu: సాయంత్రంలోపు రైతులకు జగన్‌ సమాధానం చెప్పాలి: చంద్రబాబు

అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 40-50 శాతం పంట కల్లాలు, చేల్లోనే ఉందన్నారు.

Updated : 05 May 2023 14:10 IST

అమలాపురం: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 40-50 శాతం పంట కల్లాలు, చేల్లోనే ఉందన్నారు. రైతులను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. కౌలు రౌతుల పరిస్థితేంటని సీఎం జగన్‌ను ఆయన ప్రశ్నించారు. కోనసీమ జిల్లా వేగాయమ్మపేటలో పాడైన పంటలను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

‘‘ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వమిది. పంట తడిసిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సకాలంలో గోనె సంచులను పంపించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాదా? పంపించిన కొన్ని సంచుల్లో చిరిగినవి ఉన్నాయి. అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.  రైతుల వద్దకు వచ్చే తీరిక జగన్‌కు లేదా? రైతులు ఇబ్బందుల్లో ఉంటే మంత్రులెక్కడ?  పాడైన పంటకు నష్టపరిహారం ఎప్పుడిస్తారు?  రైతుల జీవితాలతో ఆడుకుంటారా? సాయంత్రంలోపు సీఎం సమాధానం చెప్పాలి. అలా చెప్పకపోతే రైతులను మోసం చేసినట్లే. బాధిత రైతులకు పరిహారం ఎప్పుడిస్తారో స్పష్టంగా చెప్పాలి. కౌలు రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి. న్యాయం చేయలేకపోతే జగన్‌కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు. రైస్‌మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలా? రైతు పండించిన ప్రతి గింజా కొనాల్సిందే’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని