Chandrababu: ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి తెచ్చారు: చంద్రబాబు
ఏపీలో అభివృద్ధి పూర్తిగా ఆగి అవినీతి పెరిగిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా పాలన అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
ఆదోని: ఏపీలో అభివృద్ధి పూర్తిగా ఆగి అవినీతి పెరిగిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా పాలన అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోనిలో నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో అన్నింటిపైనా ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఆఖరికి చెత్త పైనా పన్ను వేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలే. ఎక్కడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈడీ దాడులు చేస్తారనే భయంతోనే జగన్ వైన్ షాప్‌ల్లో ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయి. నాసీరకం పత్తి విత్తనాలతో రైతులు నిండా మునిగారు. ఒకే రాజధాని కావాలని ఆదోని ప్రజలు చెబుతున్న విషయం తాడేపల్లిలో ఉన్న జగన్.. పేటీఎమ్ బ్యాచ్ చూడాలి. జగన్‌కు దమ్ముంటే ఆదోని వచ్చి 3 రాజధానుల గురించి అడగాలి.
150 అన్న క్యాంటీన్లను తీసేసి.. ప్రజల కడుపు కొట్టారు
రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు తీసేశారు. మొత్తం 150 అన్న క్యాంటీన్లను తీసేసి.. ప్రజల కడుపు కొట్టారు. తమిళనాడులో అమ్మా క్యాంటిన్ కంటిన్యూ చేస్తానని అక్కడి సీఎం స్టాలిన్ తెలిపారు. తెదేపా అధికారంలోకి రాగానే ప్రతి మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తాను. అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉంది. డబ్బులు సంపాదించే మార్గం నాకు తెలుసు. ఆస్తులు తాకట్టు పెట్టే మార్గం జగన్‌కు తెలుసు. నాపై కేసు పెట్టేందుకు రాజశేఖర్ రెడ్డి కూడా సాహసించలేదు. ఆదోని ఎమ్మెల్యే కేసులు పెట్టి ఏం చేస్తారు. నన్నే భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజలకు తప్ప నేనెవరికీ భయపడను.
కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా చేస్తున్నారు. మనకు నచ్చిన ఛానళ్లను చూసే హక్కు మనకుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏపీని నేర రాష్ట్రంగా చేయాలని చూస్తున్నారు. వైకాపా పాలనలో నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులకు నేను ఐటీ ఆయుధాన్ని ఇచ్చా. విద్యా విప్లవం తీసుకొచ్చాను. ఆడ పిల్లలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడ పిల్లలకే కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి వచ్చింది. సంపద సృష్టించే పార్టీ తెదేపా. వైకాపా పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు లేవు. ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. పేదవాడు పేదవాడుగా ఉండటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించి ధనికులను చేయడమే నా లక్ష్యం. అర చేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఆపలేరన్న విషయం వైకాపా నాయకులు తెలుసుకోవాలి. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేం సిద్ధం. నిండు మనసుతో ఆశీర్వదించి.. అసెంబ్లీకి పంపండి. మీ రుణం తీర్చుకుంటాను’’ అని చంద్రబాబు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!