Ap News: రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు

 రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని 

Updated : 15 Jan 2022 16:28 IST

అమరావతి‌: రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైకాపా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదన్నారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించిందని ఆక్షేపించారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయిందని.. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని వెంటనే రైతు నరేంద్ర ను విడుదల చేయాలని.. వేధింపులకు గురిచేసినందుకు అతని కుటుంబానికి పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని