Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పొరుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 22 Sep 2023 18:10 IST

కొత్తగూడెం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పొరుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బాబు కోసం మేము సైతం’ అంటూ తెదేపా కార్యకర్తలు, మహిళలు, సింగరేణి కార్మికులు కదం తొక్కారు. విజనరీ నేతను జైల్లో పెట్టి వేధిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమమన్నారు. జగన్‌ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని కూనంనేని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని