Chandrababu: సీఎం నిర్లక్ష్యం వల్లే అంకుర వ్యవస్థ ధ్వంసం: చంద్రబాబు

సీఎం జగన్‌ (jagan) నిర్లక్ష్యం వల్లే ఏపీలో అంకుర వ్యవస్థ ధ్వంసమైపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. స్టార్టప్‌ల అభివృద్ధిలో బిహార్‌ కంటే ఇప్పుడు ఏపీ దిగువన ఉందని  విమర్శించారు

Updated : 04 Feb 2023 18:36 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM Jagan) నిర్లక్ష్యం, నిరాసక్తత వల్ల రాష్ట్రంలో అంకుర సంస్థల వ్యవస్థ ధ్వంసమైందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. యువ పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను జగన్‌ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాష్ట్ర యువత భవిష్యత్‌ తలచుకుంటే బాధగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 వరకు, దేశంలోనే అత్యధికంగా అంకుర సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానంగా ఉండేదని, స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి విశాఖలో అనుకూల వాతావరణాన్ని తీసుకొచ్చామని అన్నారు. తెదేపా ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు ఎంతో కృషి జరిగిందన్నారు. అలాంటిది స్టార్టప్‌ల అభివృద్ధిలో బిహార్‌ కంటే ఇప్పుడు ఏపీ దిగువన ఉందని చంద్రబాబు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని