Chandrababu: సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనమై పోతోంది: చంద్రబాబు
ఒక సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనమైపోతుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
నిడదవోలు: ఒక సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనమైపోతుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో నిడదవోలు పట్టణం పసుపుమయమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన ఐదేళ్ల శనిని వదిలించుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సైకో ఊరికో సైకోని తయారు చేస్తున్నాడని.. వైకాపా సైకోలను భూ స్థాపితం చేసే వరకూ తాను పోరాడుతానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి నిడదవోలు వరకు చంద్రబాబు భారీ రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా గజమాలలు, మంగళహారతులతో జనం నీరాజనం పలికారు.
యువత భవిష్యత్తు కాపాడేందుకే వచ్చా...
‘‘ఇంత నీచమైన ముఖ్యమంత్రిని నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైకాపా పాలనలో ఊరికొక సైకోను తయారు చేస్తున్నారు. సైకో దెబ్బకు కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. అమరరాజా బ్యాటరీస్ రూ.9,500 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇలా అయితే, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అమరరాజా పరిశ్రమను గత సీఎంలు ప్రోత్సహిస్తే.. జగన్ వేధిస్తున్నారు. ఏపీ వ్యక్తి వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వెళ్లారు. నారాయణ విద్యాసంస్థల అధినేతనూ వేధిస్తున్నారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. పోలవరం పూర్తి చేయాలని రాత్రి, పగలు పని చేశా. రైతులకు నీరు ఇచ్చేందుకు ఎంతో దూరదృష్టితో వ్యవహరించా. కానీ, ఈ సీఎం పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుందని బాధగా ఉంది. కానీ, ప్రజల ఉత్సాహం చూస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తోంది. యువత భవిష్యత్తు కాపాడేందుకే వచ్చా’’ అని చంద్రబాబు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
CM Jagan: నెల్లూరు జిల్లా వైకాపాలో ముసలంపై సీఎం జగన్ దృష్టి
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్