Andhra News: చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ

చిత్తూరు మాజీ మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Published : 25 Jun 2022 10:52 IST

అమరావతి: చిత్తూరు మాజీ మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారన్నారు. బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు.

‘‘ఈ కేసులో కీలక సాక్షి అయిన సతీష్‌ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించారు. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపైనా దాడి చేశారు. పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు. అడ్డుకున్న మాజీ మేయర్‌ హేమలతతో దారుణంగా వ్యవహరించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ నిలబడినందుకు హేమలతపై పోలీసు జీపు ఎక్కించారు. తీవ్ర గాయాలతో హేమలత ఆస్పత్రి పాలయ్యారు. పోలీసు జీపు డ్రైవర్‌పై దాడి జరిగిందని ఆయన్నూ ఆస్పత్రిలో చేర్చారు. పూర్ణపై అక్రమ కేసు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. హేమలతపై దారుణంగా జీపు ఎక్కించి, బెదిరింపులకు పాల్పడుతున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారుల చర్యలు ఉండాలి’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని