Chandrababu: ఫలితాల విషయంలో వైకాపా అనుచిత చర్యలు.. ఈసీకి చంద్రబాబు లేఖ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల విషయంలో అధికారపార్టీ అనుచిత చర్యలకు దిగిందని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖరాశారు. 

Updated : 19 Mar 2023 00:02 IST

అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రక్రియలో తాజా పరిణామాలపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల విషయంలో అధికారపార్టీ అనుచిత చర్యలకు దిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెదేపా అభ్యర్థి గెలిచినప్పటికీ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేశారని మండిపడ్డారు. తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందినట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారి రెండు గంటల క్రితమే ప్రకటించారని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంవో నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని లేఖలో స్పష్టంచేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి నిబంధనల ప్రకారం వెంటనే డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకుంటాం: ఈసీ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని