Chandrababu: మంత్రుల అభీష్టాలు, సమర్థత మేరకు శాఖలు కేటాయింపు: చంద్రబాబు

రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated : 13 Jun 2024 00:52 IST

అమరావతి: జగన్‌ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు.

‘‘ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైకాపా ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దు. శాఖలవారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజలముందు ఉంచుదాం’’ అంటూ పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తాను సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితిపై విశ్లేషించారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థత మేరకు గురువారంలోగా శాఖలు కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదేనన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని