Chandrababu: సీఎం జగన్‌ సభలకు హాజరయ్యేందుకే డ్వాక్రా సంఘాలు: చంద్రబాబు

మహిళా శక్తి అంటే ఏంటో మళ్లీ ప్రపంచానికి చాటిచెప్పాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కొవ్వూరులోని డ్వాక్రా, అంగన్వాడీ, పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడారు.

Updated : 02 Dec 2022 16:19 IST

కొవ్వూరు: మహిళా శక్తి అంటే ఏంటో మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని రాష్ట్రంలోని మహిళలను ఎవరు పైకి తీసుకొచ్చారో.. ఎవరు మోసం చేస్తున్నారో బేరీజు వేసుకోవాలని మహిళలకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కొవ్వూరులోని డ్వాక్రా, అంగన్వాడీ, పొదుపు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘డ్వాక్రా సంఘాల స్వయం సాధికారత స్ఫూర్తిని సీఎం జగన్‌ దెబ్బతీశారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ, అమలు మాత్రం గడప దాటట్లేదు. ఇచ్చే డబ్బుకు, సీఎం దోచుకునే దానికి పొంతన లేదు. మహిళలు తమ ఇంటి ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. గత 4ఏళ్లలో మీ ఖర్చులు పెరిగిపోయాయా.. లేదా? అనేది చూసుకోవాలి. మీ కొనుగోలు శక్తి తగ్గిందో లేదో ఆలోచన చేయాలి. కేవలం తన సభలకు హాజరు కావడం కోసమే డ్వాక్రా సంఘాలను సీఎం జగన్‌ వినియోగించుకుంటున్నారు. మహిళల ఆత్మగౌరవానికి తెదేపా మరుగుదొడ్లు కట్టిస్తే, వాటిపైనా పన్ను విధించిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది. తెదేపా అధికారంలోకి రాగానే మళ్లీ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తాం. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు