Chandrababu: జగన్‌ ప్రోద్బలంతోనే సభలో మా ఎమ్మెల్యేలపై దాడి: చంద్రబాబు

అసెంబ్లీలో  తమ పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. శాసనసభలో ఎమ్మెల్యేపై దాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు.

Updated : 20 Mar 2023 12:21 IST

అమరావతి: అసెంబ్లీలో  తమ పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. శాసనసభలో ఎమ్మెల్యేపై దాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ‘‘అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటిరోజు. సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే దళిత సభ్యుడు డోలా బాల వీరాజంనేయ స్వామిపై దాడి చేశారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన వ్యక్తిగా జగన్‌ నిలిచిపోతారు. వైకాపా సిద్ధాంతమేంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇది శాసనసభ కాదు.. కౌరవ సభ’’ అని చంద్రబాబు అన్నారు. 

శాసనసభలో స్పీకర్‌ పోడియం వద్ద  నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు తెదేపా సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాసేపట్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని