Chandrababu: చంద్రబాబు ‘రైతుపోరుబాట’ పాదయాత్ర ప్రారంభం

ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు ‘రైతు పోరుబాట’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.

Updated : 12 May 2023 11:19 IST

తణుకు: ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు ‘రైతు పోరుబాట’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఇరగవరం నుంచి తణుకు వైజంక్షన్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. సుమారు 12 కిలోమీటర్లు చంద్రబాబు నడవనున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో మార్గంమధ్యలో మాట్లాడుతూ ఆయన ముందుకు సాగుతున్నారు.

పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యంతోనే రైతులు రోడ్డెక్కారని.. తిరుగుబాటు చేస్తూ పోరాటానికి ముందుకొచ్చారన్నారు. కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడుతానని.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని చెప్పారు. రైతులంతా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుపోరుబాట పాదయాత్ర.. వైకాపా ప్రభుత్వానికి అంతిమయాత్ర అవుతుందని ఈ సందర్బంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని