Chandrababu: ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటపాలెం చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

Updated : 21 Jun 2024 14:12 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటపాలెం చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి చంద్రబాబు అసెంబ్లీకి బయలుదేరారు. నేడు అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయిస్తారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.

చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. దాన్ని నిలబెట్టుకుంటూ ఆయన శుక్రవారం అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని