Chandrababu: రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. పోలవరం వద్ద ఉద్రిక్తత

పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు పోలీసుల అనుమతి నిరాకరించారు. దీంతో పోలవరం డ్యాం సైట్ కు వెళ్లే మార్గంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు.

Updated : 01 Dec 2022 20:21 IST

పోలవరం: పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు పోలీసుల అనుమతి నిరాకరించారు. దీంతో పోలవరం డ్యాం సైట్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. తనతో పాటు, మరో ఐదుగురు నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని ఆయన కోరారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. పోలవరం వద్దకు తెదేపా శ్రేణులు భారీగా చేరుకున్నాయి. చంద్రబాబుతో పాటు తెదేపా నేతలు దేవినేని ఉమా, రామానాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్టు వైపు వెళ్లే మార్గంలో ఉదయం పెట్టిన బారికేడ్లు తొలగించి, పోలీసు వ్యాను, జీపులను అడ్డంగా పెట్టారు. పోలీసుల తీరు పట్ల చంద్రబాబు మండిపడ్డారు. తాను పోలవరం ఎందుకు వెళ్లకూడదో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చీకటి జీవోలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని