Andhra News: ఏపీలో విద్యుత్తు కోతలు.. బాలింతల పరిస్థితిని వివరిస్తూ ట్విటర్‌లో చంద్రబాబు వీడియో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యుత్తు కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితిని వివరిస్తూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. నాడు మిగులు విద్యుత్తుతో వెలుగులు నిండిన రాష్ట్రంలో...

Updated : 08 Apr 2022 04:13 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యుత్తు కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితిని వివరిస్తూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. నాడు మిగులు విద్యుత్తుతో వెలుగులు నిండిన రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరని నిలదీశారు. తీవ్రమైన విద్యుత్తు కోతలతో జనం నరకం చూస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామాల్లో అనధికార కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్తు సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలు పడుతున్న బాధలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఓవైపు గ్రామ గ్రామాన ప్రజలు కరెంట్ లేక రోడ్డెక్కుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ సీఎంను ఏమనాలని మండిపడ్డారు. విద్యుత్తు కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని.. సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని