Chandrababu: కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్‌ భవన్‌కు సీఎం చంద్రబాబు

తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Updated : 07 Jul 2024 13:32 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెదేపా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చేరుకున్నారు. చంద్రబాబుకు తెలంగాణ తెదేపా నేతలు సన్మానం చేయనున్నారు. అనంతరం కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని