Chandrababu: ఉత్తుత్తి ప్రకటనలు మాని దోషులకు శిక్ష పడేలా చూడండి: చంద్రబాబు

కాకినాడలో నడిరోడ్డుపై ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన యువతి దేవిక విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని స్వయంగా సీఎం ప్రకటనలు చేయడం మోసగించడమేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 09 Oct 2022 11:58 IST

అమరావతి: కాకినాడలో నడిరోడ్డుపై ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన యువతి దేవిక విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని స్వయంగా సీఎం ప్రకటన చేయడం ప్రజల్ని మోసగించడమేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రకటనలకే పరిమితమైందని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని దోషులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అప్పుడే నేరస్థులకు భయం, మహిళలకు నమ్మకం కలుగుతుందన్నారు. కొత్త చట్టాలు కాదు.. కనీసం ఉన్నచట్టాల ప్రకారమైనా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసుపెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం ఎంత అలసత్వంతో ఉందో ఈ ఘటన రుజువు చేస్తోందని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని