Andhra News: భగ్గుమన్న అమలాపురం.. ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే: చంద్రబాబు

కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న

Published : 25 May 2022 01:50 IST

అమరావతి: కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఘర్షణలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. అల్లర్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తెదేపాపై నెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సున్నిత అంశంలో హోంశాఖ మంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఆందోళనలో భాజపా శ్రేణులు పొల్గొనరు: సోము వీర్రాజు

అమలాపురం ఘటనను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘర్షణలు నిలువరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆందోళనలో భాజపా శ్రేణులు పొల్గొనరని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని