Chandrababu: తెదేపా కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తా: చంద్రబాబు

సీఎం జగన్‌ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కోడుమూరులో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు.

Updated : 16 Nov 2022 19:57 IST

కోడుమూరు: సీఎం జగన్‌ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కోడుమూరులో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సీఎం కాలక్షేపం చేస్తున్నారని  మండిపడ్డారు.

గుండ్రేవుల, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులకు అనుమతులిచ్చినా వాటిని గాలికి వదిలేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం 3 రాజధానులు ఎలా కడతారని ఎద్దేవా చేశారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు వంతపాడటం మానుకోవాలని హితవుపలిన చంద్రబాబు.. తెలుగుదేశం కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తామని హెచ్చరించారు. ‘డోన్‌లో పనికిమాలిన మంత్రి నా కార్యకర్త కాంపౌండ్ వాల్ కూల్చారు.. పోలీసులారా మీ జీవితాలను ఇబ్బందుల్లోకి తెచ్చుకోవద్దు’ అని హితవు పలికారు. రాష్ట్రంలో పేద ప్రజలకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదన్నారు. బాబాయ్‌ హత్యకేసు వేరే రాష్ట్రానికి మార్చే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు రోడ్‌ షోకు తెదేపా కార్యకర్తలు భారీగా తరలిరావడంతో  కోడుమూరు జనసంద్రంగా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని