Chandrababu: రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటా: చంద్రబాబు

తెదేపా అధికారంలోకి వచ్చాక జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకూ న్యాయం చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘మహానాడు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Updated : 27 May 2023 20:02 IST

రాజమహేంద్రవరం: రాష్ట్ర నాశనమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పరిపాలన సాగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘మహానాడు’లో ఆయన మాట్లాడారు. 2019లో ఏపీ ఆదాయం ₹66,786 కోట్లు కాగా.. తెలంగాణది ₹69,620 కోట్లని తెలిపారు. 2022-23 నాటికి తెలంగాణ ఆదాయం ₹1.32 లక్షల కోట్లు అయితే ఏపీ ఆదాయం ₹94,916 కోట్లు మాత్రమేనన్నారు. ఆనాడు సమానంగా ఉన్న ఆదాయం.. జగన్ పాలనతో తగ్గిందని మండిపడ్డారు. ఏపీ కంటే తెలంగాణలో 40శాతం అధికంగా ఆదాయం ఉందన్నారు. జగన్‌ విధ్వంస పాలనతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మళ్లీ కాపాడే బాధ్యత తెదేపా తీసుకుంటుందని చెప్పారు. 

‘‘రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధిని ఆపేశారు. అమరావతి, పోలవరం పూర్తయితే ఏపీ కూడా కళకళలాడేది. అనుభవం లేని వ్యక్తి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏటా రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోంది. పేదలను మరింత నిరుపేదలను చేస్తున్నారు. ఏపీలో జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను ఆదాయం తగ్గింది. మాదిగలు, దూదేకుల వర్గంలో ప్రత్యేక డిమాండ్లు ఉన్నాయి. తెదేపా అధికారంలోకి వచ్చాక జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకూ న్యాయం చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని