Chandrababu: ఈ రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం: చంద్రబాబు
వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
దెందులూరు : వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయాలు వెలుగులోకి రావాలన్నారు. ఈ అంశంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా అని నిలదీశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని విజయరాయిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
‘‘ఎన్నికల్లో వైకాపా గెలిస్తే అమరావతి రాజధానిగా ఉండదని, పోలవరం ముంచేస్తారని ఆనాడే ప్రజలకు వివరించా. ముద్దులు పెడుతున్నాడని మోసపోవద్దని.. గెలిచిన తర్వాత పిడిగుద్దులుంటాయని స్పష్టంగా చెప్పా. ఆనాడు నేను చెప్పిందే ఇవాళ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. అందుకే ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ అని కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే.. ప్రజలు ఇప్పుడైనా నా మాట వింటారని. ఇప్పుడు కూడా వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుంది. నాకు కాదు. నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు. ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశాను. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఎమ్మెల్యే పదవితో పనిలేదు. ఈ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలి. ధైర్యంగా ముందుకు రావాలి. భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుంది.
తెదేపా హయాంలోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఇప్పుడున్న మంత్రికి డయాఫ్రం వాల్ అంటే ఏంటో కూడా తెలీదు. ఆకాశంలో ఉంటుందని అనుకుంటున్నారు. నా బాధంతా రాష్ట్రం కోసమే. నెలకొక్కసారి పోలవరం వచ్చేవాడిని. సోమవారం పోలవరంగా మార్చాను. సమీక్షలు చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిగెత్తించా. గేట్లు పెట్టేంతవరకు పనులు పూర్తి చేయించాను. సీఎంగా ప్రమాణం చేసిన రోజునే రివర్స్ టెండర్ అని తీసుకొచ్చి పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డబ్బుల కోసం కాంట్రాక్టర్లను మార్చేశారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందేది. ఇప్పుడు పోలవరం పూర్తి కాకపోవడానికి నేనే కారణమని అంటున్నారు. అబద్ధాలు చెప్పడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. మూడున్నరేళ్లుగా ఒకటే పని చేస్తున్నారు. అమాయకులపై కేసులు పెట్టి వేధించడం. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది’’ అని చంద్రబాబు అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం