Chandrababu: జగన్‌ ఎంత బలహీనుడో కేబినెట్ విస్తరణతోనే అర్థమైంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోసపు రెడ్డి పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం నెలకొందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పార్టీ...

Published : 18 Apr 2022 16:42 IST

అమరావతి: జగన్ పాలనతో ఏపీలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం నెలకొందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఒక అపరిచితుడని.. ఆయన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్‌లో వెళ్తోందని మండిపడ్డారు. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాణి హస్తం ఉందని ఆరోపించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతవర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉందన్నారు. జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని చంద్రబాబు విమర్శించారు.

జగన్ ఎంత బలహీనుడో కేబినెట్ విస్తరణ చూస్తేనే అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. వైకాపాలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా బయటపడిందన్నారు. బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోందన్నారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది కూడా దోపిడీ చేసేందుకేనని ఆరోపించారు. ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛన్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని