Chandrababu: ఏలూరు జిల్లా పర్యటనకు చంద్రబాబు.. కలపర్రు టోల్గేట్ వద్ద ఘనస్వాగతం
తెదేపా అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో పెదవేగి మండలం విజయరాయిలో ‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఏలూరు: తెదేపా అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో పెదవేగి మండలం విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా కలపర్రు టోల్గేట్ వద్ద చంద్రబాబుకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తెదేపా శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీతో జానంపేట మీదుగా విజయరాయి చేరుకున్నారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించనున్నారు. విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమం ప్రారంభించి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30కు బయలుదేరి 3 గంటలకు వలసపల్లి అడ్డరోడ్డు వద్దకు చేరుకుంటారు. ధర్మాజీగూడెం, మఠంగూడెం, లింగపాలెం గ్రామాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు చింతలపూడిలోని భారత్ పెట్రోలు బంకు వద్ద నుంచి రోడ్డు షో ప్రారంభిస్తారు. బోసు బొమ్మ కూడలిలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వైకాపా ప్రభుత్వ తీరుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాడేందుకు తెదేపా శ్రేణులను చంద్రబాబు సమాయత్తం చేయనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం