Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Updated : 30 May 2023 15:51 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇస్తూ ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘వైఎస్ జగన్ మొదట చెప్పిన విధ్వంస విధానాన్నే వైకాపా ప్రభుత్వం నిత్యం పాటిస్తోంది. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో రాష్ట్ర విధ్వంసం మొదలైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఎంగా జగన్ ఇచ్చిన తొలి ఆదేశాలు, ప్రజా వేదిక కూల్చివేత దృశ్యాలు ఉన్న వీడియోను చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు