Chandrababu: వైకాపా విధానాల వల్లే ఏపీలో విద్యారంగం నాశనం: చంద్రబాబు

నాలుగేళ్లుగా ఏపీలో వర్సిటీల ర్యాంకింగ్ పడిపోతోందని.. ఎన్‌ఐఆర్ఎఫ్‌ నివేదికను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 07 Jun 2023 18:23 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో విద్యారంగం నాశనం అయిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్సిటీలకు ర్యాంకులు కేటాయిస్తూ కేంద్ర ఉన్నత విద్యా శాఖ విడుదల చేసిన నివేదికను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

‘‘నాలుగేళ్లుగా ఏపీలో వర్సిటీల ర్యాంకింగ్ పడిపోతోంది. ఎన్‌ఐఆర్ఎఫ్‌ నివేదికను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. 2019లో 29వ ర్యాంక్‌లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ నేడు 76వ స్థానానికి పడిపోయింది. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ కనీసం టాప్ 100లో కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకపోవడం, వర్సిటీలను వైకాపా రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని