Punjab Politics: పంజాబ్‌ సీఎంగా రేపు 11 గంటలకు చరణ్‌జిత్‌ ప్రమాణ స్వీకారం

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా అనంతరం.. కాంగ్రెస్‌ పార్టీ చన్నీని తదుపరి సీఎంగా ఖరారు చేసిన విషయం తెలిసిందే...

Published : 19 Sep 2021 21:42 IST

చండీగఢ్‌: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా అనంతరం.. కాంగ్రెస్‌ పార్టీ చన్నీని తదుపరి సీఎంగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ను కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న లేఖను గవర్నర్‌ను అందజేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. 

చరణ్‌జిత్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారా? లేదా మంత్రుల ప్రమాణస్వీకారం కూడా ఉంటుందా? అనే విషయంపై స్పష్టత రాలేదు. మరోవైపు పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ.. చరణ్‌జిత్‌కు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని సూచించారు. చామ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందని చరణ్‌జిత్‌ సింగ్‌... 2015-2016 మధ్య అసెంబ్లీలో కాంగ్రెస్‌ తరఫున ప్రతిపక్ష నాయకుడిగానూ వ్యవవహరించారు. అమరీందర్‌ కేబినెట్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని